HomeWarangal Newsవ్యక్తిత్వ వికాసమే అన్ని రంగాల అభివృద్ధికి మూలం: సీపీ ఎన్. శ్వేత

వ్యక్తిత్వ వికాసమే అన్ని రంగాల అభివృద్ధికి మూలం: సీపీ ఎన్. శ్వేత

Published on

spot_img

వరంగల్: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS అన్నారు. వ్యక్తిత్వ వికాసమే విద్య, ఉద్యోగం, సామాజిక సేవతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.

గురువారం పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) దిశానిర్దేశక కార్యక్రమానికి సీపీ ఎన్. శ్వేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, NSS కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సమాజానికి ఉపయోగపడే NSS వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనడం ద్వారా సేవాభావంతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చని సీపీ పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి, NSS ప్రోగ్రామ్ అధికారులు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.