HomeLatest Newsటైటిల్ గెలిచి డబుల్ జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర!

టైటిల్ గెలిచి డబుల్ జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర!

Published on

spot_img

టైటిల్ గెలిచి డబుల్ జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) జట్టు ఐపిఎల్ లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గత సీజన్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తొలి ఐపిఎల్ టైటిల్ ని గెలుచుకున్న ఆర్సిబి.. ఈసారి కూడా అదే జోరుని కొనసాగిస్తూ వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లో జరిగిన ఐపిఎల్ 2026 ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యార్ అద్భుత ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడి గుజరాత్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగింది. వారి మెరుపు బ్యాటింగ్ తో ఆర్సిబి కేవలం 3.3 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 పరుగులు మార్కు దాటించింది.

ఈ ప్రదర్శనతో ఆర్సిబి ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ లో అత్యంత వేగంగా 50 పరుగులు పూర్తి చేసిన జట్టుగా బెంగుళూరు నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. CSK 2023 ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై 24 బంతుల్లో 50 పరుగులు నమోదు చేసింది. అయితే ఆర్సిబి కేవలం 21 బంతుల్లోనే ఆ మార్క్ చేరుకొని ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టైటిల్ విజయంతో పాటు ఈ ప్రత్యేక రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకున్న రజత్ పాటిదార్ సేన ఐపీఎల్ చరిత్రలో మరో మైలు రాయిని అందుకుంది. వరుసగా రెండుసార్లు ఛాంపియన్ గా నిలవడం ద్వారా ఆర్సిబి కొత్త శకానికి శ్రీకారం చుట్టిందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.