గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కు సంబంధించిన బికినీ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ రుక్మిణి వసంత్ అంటే పద్ధతికి మరో మారుపేరు అంటూ ఒక ట్యాగ్ లైన్ ఉంది. అయితే సడన్ గా ఆమెకు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలు బయటకు రావడంతో జనాలు షాక్ అయిపోయారు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ బాగా బాధపడిపోయారు. ఇది రుక్మిణి వసంత్ ఒరిజినల్ బికినీ ఫోటోలు కావు అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించడం ప్రారంభించారు.
అంతేకాదు రుక్మిణి వసంత్ బికినీ ఫేక్ ఫోటోలపై రియాక్ట్ అవ్వాలి అంటూ పలు హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేశారు. ఫైనల్లీ ఫేక్ బికినీ ఫొటోస్ పై రుక్మిణి వసంత్ స్పందించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీతో ఫోటోషూట్ జరిగినట్లు ఆన్లైన్ వేదికగా వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు, వీడియోలు అన్ని ఫేక్ అని రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు.

ఏఐ సహాయంతో అసభ్యకర రీతిలో తన ఫోటోలను క్రియేట్ చేసి సామాజ మాధ్యమాలలో పోస్ట్ చేయడం అత్యంత బాధ్యతారహిత్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి చట్ట పరంగా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.
దీనిపై రుక్మిణి ఫాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. హీరోయిన్ ఫోటోలను ఇలా మార్ఫ్ చేయడం కరెక్టేనా..? కడుపుకు అన్నం తినే వాళ్ళు ఇలా చేస్తారా..? అంటూ ఘాటుగా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు..!!


