HomeWarangal Newsసంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ సన్ ప్రీత్ సింగ్

సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ సన్ ప్రీత్ సింగ్

Published on

spot_img

వరంగల్:

వరంగల్ పోలీస్ కమిషనర్ Sun Preet Singh గురువారం సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

Sangem Police Station

ఈ సందర్భంగా ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన సీపీ, స్టేషన్ ఆవరణలో మామిడి మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రజల జీవన విధానం, స్థానిక నేరాలు, రౌడీ షీటర్లు మరియు అనుమానితులపై ఇన్స్‌పెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

పోలీస్ సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు ప్రక్రియపై రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా పోలీసులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని తెలిపారు. ప్రజల విశ్వాసం పొందేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సిఐ రాజగోపాల్, సంగెం ఎస్‌ఎస్‌ఐ వంశీకృష్ణతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.