HomeLatest Newsమంత్రి సీతక్క పరువు నష్టం దావా: బీఆర్ఎస్‌కు సిటీ సివిల్ కోర్టు షాక్.. 

మంత్రి సీతక్క పరువు నష్టం దావా: బీఆర్ఎస్‌కు సిటీ సివిల్ కోర్టు షాక్.. 

Published on

spot_img

హైదరాబాద్: అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ చేసినవి తప్పుడు ప్రచారాలని ప్రాథమికంగా నిర్ధారిస్తూ, మంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 ఆరోపణల్లో వాస్తవం లేదు: కోర్టు

అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలులో సుమారు రూ.30 కోట్ల మేర అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, టెండర్ నోటిఫికేషన్ల నుండి చెల్లింపుల వివరాల వరకు అన్ని ప్రభుత్వ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం.. ఈ ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

ప్రభుత్వం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ.11,650 చొప్పున మొత్తం రూ.44.42 కోట్లతో పారదర్శకంగా కొనుగోలు చేసిందని పత్రాలు చెబుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం రూ.8,499 విలువైన ఫోన్‌ను రూ.14,499కి కొనుగోలు చేశారంటూ తప్పుడు ప్రచారం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన వివాదాస్పద కంటెంట్‌ను తక్షణమే డిలీట్ చేయాలని ఆదేశించింది.

 రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం

మంత్రి సీతక్క ప్రతిష్ఠను రాజకీయంగా దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన అసత్య ఆరోపణలు చేసిందన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగంపై మంత్రి సీతక్క దాఖలు చేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారణకు స్వీకరించింది.

ఈ కేసులో మంత్రి తరఫున సీనియర్ అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించి, బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు. వాదనల అనంతరం, బీఆర్ఎస్ పార్టీకి మరియు కేసీఆర్‌కు కోర్టు గట్టి హెచ్చరికలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలను సరిచూసుకోవాలని ఈ తీర్పు ద్వారా కోర్టు పరోక్షంగా సూచించింది.

Latest articles

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.
spot_img

Related Articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.