హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ ప్రతినిధి ఓరుగంటి స్నేహ నియమితులయ్యారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది.
ఈ నిర్ణయాన్ని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా మరియు ఇతర సభ్యులు స్వాగతించారు. ఈ నియామకం తమ కమ్యూనిటీకి దక్కిన గొప్ప గౌరవమని,రాజకీయాల్లో ఇలాంటి మార్పులు రావడం వల్ల అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.


