ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమై, పునాదులు పూర్తయి మధ్యలో నిలిచిపోయిన ‘ఇందిరమ్మ ఇళ్లను’ పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు.
గోడలు, స్లాబులు పడని ఇళ్లకు రూ. 3 లక్షల చొప్పున మరియు గోడలు పూర్తయి స్లాబు పడని ఇళ్లకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిధులు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

