HomeLatest Newsతెలుగు ప్రజల గర్వకారణం ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ

తెలుగు ప్రజల గర్వకారణం ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ

Published on

spot_img

తెలుగు ప్రజల గర్వకారణం ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ:

హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వారి సేవలు, ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. నీతి-నిజాయితీ-నిబద్ధతకు ప్రతీక గా నిలిచిన ఎన్టీఆర్ కుల-మత-భాషా భేదాలకు అతీతంగా ప్రజల మననలను పొందారాని కొనియాడారు” .

తెలంగాణ రాజకీయాలలోనూ ఎన్టీఆర్ పాత్ర ఎంతో గొప్పదని..రాష్ట్రానికి చెందిన అనేక మంది నాయకులకు ఆయన రాజకీయ జీవితానికి బాటలు వేసారని గుర్తుచేశారు. అలాంటి మహానేత స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో భారీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, 30 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకి రప్పించడంతోపాటు రాష్ట్ర యువతను భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సంక్షేమ పథకాల విషయంలోనూ ఎన్టీఆర్ ఆలోచనలే తమకు స్ఫూర్తి అని పేర్కొన్న ముఖ్యమంత్రి, రెండు రూపాయల కిలో బియ్యం పథకం నుంచి ప్రేరణ పొంది రాష్ట్రంలో కోట్లాది మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. జనతా వస్త్రాల పథకాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇందిరాగాంధీ ఆశయాలు ఎన్టీఆర్ స్ఫూర్తి కలయికే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా పాలన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు: కనీస ఛార్జీ రూ.30 ఖరారు

తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి 1.6 కి.మీ.కు కనీస ఛార్జీ రూ.30 కాగా, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.14 ఖరారు చేశారు.