Thanduru : ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రేమ పేరుతో నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడి..
ఆమెకు గర్భం రావడానికి కారణమైన నిందితుడిని తాండూరు పోలీసులు క్విక్ రెస్పాన్స్ తో అరెస్ట్ చేశారు.
రాత్రికి రాత్రి పొక్సో కేసు పెట్టడమే కాదు వెంటనే అతడిని రిమాండ్ కి కూడా తరలించారు. బొమ్రాస్ పేట మండంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ప్రస్తుతం తాండూర్ లో నివసిస్తుంది.
ఆమెకు బంధువైన గౌతాపూర్ గ్రామ నివాసి శివకుమార్ తో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలోనే శివకుమార్ ఆ బాలికకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. పెద్దలను ఒప్పించి కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికాడు.
అతగాడి మాయమాటలకు ఇట్టే పడిపోయిన ఆ బాలిక అతనిని ప్రేమించడం ప్రారంభించింది. అంతేకాదు శివకుమార్ పలుసార్లు ఆ బాలిక పై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు.
ఇటీవలే ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల షాక్ అయిపోయారు. ఎవరతను అని ప్రశ్నించారు.
దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బాలిక శివకుమార్ కి తాను గర్భవతి అనే విషయాన్ని చెప్పింది.
శివకుమార్ బుకాయించాడు. తన కడుపులోని బిడ్డకి నాకు సంబంధం లేదు అంటూ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
దీంతో శివకుమార్ చేతిలో మోసపోయారని గ్రహించిన ఆ అమ్మాయి ఆదివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాలి అంటూ తన తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది.
వెంటనే బాధితురాలి ఫిర్యాదు మేరకు తాండూరు పట్టణ పోలీసులు స్పందించి నిందితుడు శివకుమార్ పై అత్యాచారంతో పాటు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పొక్సో) POCSO కింద కూడా కేసు నమోదు చేశారు.
ఆదివారం రాత్రి కేసు నమోదు చేసి సోమవారం ఉదయం వెంటనే నిందితుడిని పోలీసుల అలుపులోకి తీసుకొని.. ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి..
వెంటనే స్థానిక న్యాయస్థానంలో హాజరు పరిచారు పోలీసులు. అంతేకాదు న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతడిని రిమాండ్ కి తరలించారు.
బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
కేసు నమోదు అయిన కొన్ని గంటల్లోనే తాండూరు పట్టణ పోలీసులు క్విక్ రెస్పాన్స్ చూపించి అతగాడికి శిక్ష పడేలా వెంట వెంటనే ప్రాసెస్ కంప్లీట్ చేసి రిమాండ్ కు తరలించేలా చేయడం సంచలనంగా మారింది.
ఇలాంటి ఘటనలు మనం రోజు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం.
కానీ తాండూరు పోలీసుల(Thandur Police) క్విక్ రెస్పాన్స్ కి సోషల్ మీడియా ఫీదా అయిపోయింది. నెటిజన్స్ ఇప్పుడు తాండూరు పోలీసులను ప్రశంసించేస్తున్నారు.


