వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయగా, అందులో వరంగల్ కమిషనరేట్ నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు.
పదోన్నతి పొందిన వారు వీరే:
పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొర్ల సీతారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సార్ల రాజు, మరియు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వీరి ముగ్గురినీ డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతుల పట్ల వరంగల్ పోలీస్ శాఖలోని తోటి అధికారులు మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.


