HomeWarangal Newsరాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ సన్ ప్రీత్ సింగ్..!

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ సన్ ప్రీత్ సింగ్..!

Published on

spot_img

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం హనుమకొండ నగరానికి తొలిసారిగా వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

హనుమకొండలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలపై కమిషనర్ వివరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సీసీ కెమెరాల విస్తరణ, రాత్రి పహారా బలోపేతం, ట్రాఫిక్ నియంత్రణ, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, పండుగలు, ముఖ్య కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పనిచేస్తోందని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సురేందర్ రెడ్డి, పోలీస్ శాఖ పనితీరును అభినందిస్తూ ప్రజలకు భరోసా కలిగించే విధంగా సేవలు అందించాలి అని సూచించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణం లో కొనసాగింది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.
spot_img

Related Articles

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.