వరంగల్ నగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో జరగబోయే ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమాల వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక విడుదలయింది.
ఈ మహోత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలు:
ఈ వేడుకలు జూన్ 15, 2026 (సోమవారం) నుండి జూన్ 17, 2026 (బుధవారం)వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
15-06-2026 (సోమవారం): గణపతి పూజ, పుణ్యాహవాచనము, పూర్వాంగవిధి, ప్రతిష్ఠా యాగారంభం మరియు జలాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
16-06-2026 (మంగళవారం): ధాన్యాధివాసం, ఫలపుష్ప మరియు శయ్యాధివాసములు ఉంటాయి.
17-06-2026 (బుధవారం):ఉదయం 8 గంటల 36 నిమిషాలకు పునర్వసు నక్షత్రయుక్త, కర్కాటక లగ్న సుముహూర్తమున అత్యంత ప్రధాన ఘట్టమైన “ధ్వజస్తంభ ప్రతిష్ఠ” కార్యక్రమం జరుగుతుంది.
పీఠాధిపతుల సమక్షంలో..
శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు, శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యులు, అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకరభారతీ స్వామి వారి కరకమలములచే ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరగనుంది.
ఆలయ కమిటీ ఆహ్వానం
ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త & చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యం, సహాయ కమిషనర్ & కార్యనిర్వహణాధికారి ఆర్. సునీత, మరియు ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులను ఆహ్వానిస్తున్నారు.
FAQ’s
1. భద్రకాళి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుంది?
జూన్ 17, 2026 ఉదయం 8:36 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది.
2. ఈ మహోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి?
మూడు రోజుల పాటు (జూన్ 15 నుండి 17 వరకు) నిర్వహిస్తారు.
3. మొదటి రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి?
గణపతి పూజ, పుణ్యాహవాచనము, యాగారంభం, జలాధివాసం నిర్వహిస్తారు.
4. రెండవ రోజు ప్రత్యేకత ఏమిటి?
ధాన్యాధివాసం, ఫలపుష్ప మరియు శయ్యాధివాసం జరుగుతుంది.
5. ఈ కార్యక్రమానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు?
జగద్గురు శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకరభారతీ స్వామి వారి సమక్షంలో జరుగుతుంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


