హనుమకొండ:
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులు సత్తా చాటారు. కఠినమైన సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.
ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. వారిలో
తరుణ్ తేజ అట్లా (వరంగల్ అర్బన్) – ఆల్ ఇండియా ర్యాంక్ 123
విక్రమ్ బెతి (వరంగల్ అర్బన్) – ఆల్ ఇండియా ర్యాంక్ 472
ఆశిష్ అనిశెట్టి (వరంగల్ అర్బన్) – ఆల్ ఇండియా ర్యాంక్ 676
దైనంపల్లి ప్రవీణ్ (ములుగు) – ఆల్ ఇండియా ర్యాంక్ 793
జీతేందర్ నాయక్ (జయశంకర్ భూపాలపల్లి) – ఆల్ ఇండియా ర్యాంక్ 939
ఈ అభ్యర్థులు తమ పట్టుదల, కృషితో సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్, ఐపీఎస్ వంటి కీలక ఆల్ ఇండియా సర్వీసుల్లో చేరే అవకాశాన్ని పొందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు విజయాన్ని సాధించడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు విజేతలకు అభినందనలు తెలియజేశారు.


