న్యూఢిల్లీ | పార్లమెంట్ | 24-03-2026
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య గారు గ్రామీణ ఉపాధి కల్పనలో కీలకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో జరుగుతున్న లోపాలను లోక్‌సభలో ప్రస్తావించారు.
ఈ పథకం కింద కుటుంబాలకు 125 రోజుల వరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, వరంగల్ జిల్లాలో అమలు చాలా నిరాశాజనకంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనకర గణాంకాలు:
2023-24లో 100 రోజులకు పైగా ఉపాధి పొందిన కుటుంబాలు కేవలం 42
2024-25లో అది మరింత తగ్గి 29 కుటుంబాలకు పరిమితం
ఈ సంఖ్యలు రాష్ట్రం, దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు.
పనులు జరిగాయి… కానీ ఉపాధి లేదు
జిల్లాలో నీటి సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా—
గత రెండేళ్లలో 5,348 పనులు పూర్తి
రూ. 65 కోట్లకు పైగా వ్యయం
అయినా గ్రామీణ కుటుంబాలకు సరిపడ ఉపాధి కల్పించడంలో లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు.
కొత్త చట్టం అమలు ఎక్కడ?
2025లో ప్రకటించిన
“వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)” కింద 125 రోజుల ఉపాధి హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదని పేర్కొన్నారు.
ఎంపీ డిమాండ్లు:
వెంటనే 125 రోజుల ఉపాధి హామీ అమలు చేయాలి
తెలంగాణలో పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి
ఇలా చేస్తే వరంగల్ జిల్లా గ్రామీణ కుటుంబాలకు అదనపు పనిదినాలు, సమయానికి వేతనాలు లభించి వారి జీవనోపాధి మెరుగుపడుతుందని డా. కడియం కావ్య గారు స్పష్టం చేశారు.


