HomeWarangal Newsపార్లమెంట్‌లో వరంగల్ నిరుద్యోగ సమస్యల ప్రస్తావన – ఎంపీ డా. కడియం కావ్య

పార్లమెంట్‌లో వరంగల్ నిరుద్యోగ సమస్యల ప్రస్తావన – ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

న్యూ ఢిల్లీ | తేది: 16-03-2026

వరంగల్ జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఉపాధి కోసం యువత ఇతర నగరాలకు వలస వెళ్తున్న అంశాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

పరిశ్రమల అభివృద్ధి లేకపోవడం, స్థానికంగా తగిన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యువతతో పాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధానంగా 15–29 సంవత్సరాల మధ్య యువతలో నిరుద్యోగం ఎంత మేర ఉందో, ఈ వలసలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వివరాలు ఇవ్వాలని ఎంపీ కోరారు.

అలాగే వ్యవసాయ పనులు లేని ఆఫ్ సీజన్ సమయంలో సీజనల్ వ్యవసాయ కూలీలకు ఆదాయం, భద్రత కల్పించేందుకు ప్రత్యేక పథకాలు ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) తాజా గణాంకాలను వెల్లడించారు.

వాటి ప్రకారం తెలంగాణలో యువత నిరుద్యోగం 2017–18లో 23.3 శాతం ఉండగా 2023–24 నాటికి 16.6 శాతానికి తగ్గిందని తెలిపారు.

అదే సమయంలో వర్కర్ పాప్యులేషన్ రేషియో 32 శాతం నుంచి 40.7 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగం 17.8 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గగా, ఉపాధిలో ఉన్న వారి శాతం 31.4 నుంచి 41.7కు పెరిగిందని మంత్రి వివరించారు.

యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు స్కిల్ ఇండియా మిషన్, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY), నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే సాధారణ పథకాలతో మాత్రమే వరంగల్ ప్రాంతంలోని ప్రత్యేక సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీ డా. కడియం కావ్య అభిప్రాయపడ్డారు.

పరిశ్రమల కొరత, వ్యవసాయ ఆధారిత ఉపాధి సీజనల్‌గా ఉండటం వల్ల యువత వలసలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

వరంగల్ ప్రాంతానికి ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.