HomeWarangal Newsవరంగల్ పోలీస్ కమిషనర్ : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు

వరంగల్ పోలీస్ కమిషనర్ : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు

Published on

spot_img

వరంగల్ : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందాం: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

నూతన సంవత్సర వేడుకలను ఆనందభరితంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆయన ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

డిసెంబర్‌ 31 రాత్రి జరిగే వేడుకల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌, షీ టీమ్స్‌ మరియు పెట్రోలింగ్‌ విభాగాల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు బలపరుస్తున్నట్లు తెలిపారు. వేడుకలు రాత్రి 12.30 గంటలకు ముగించాలని సూచిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.

వేడుకల ప్రాంగణంలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఏర్పాటు చేయడం, అశ్లీల నృత్యాలు నిషేధించడం సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కఠినంగా అమలు చేస్తామని, అలాంటి వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. వేగంగా వాహనాలు నడపడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు కూడా చట్టపరమైన శిక్షలు విధించబడతాయని తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలు రాకుండా పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతామని చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులను కలిగించే విధంగా వేడుకలు నిర్వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఎవరు నియమాలు ఉల్లంఘించినా ప్రజలు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రజలు తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరంగా, ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.