బాధ్యతాయుతమైన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, మానవత్వాన్ని మరువని గుండెలు కొందరిలో ఉంటాయి. అందుకు నిదర్శనంగా నిలిచారు వరంగల్ నగరానికి చెందిన శానిటేషన్ సిబ్బంది.
ఫాతిమా నగర్ చర్చి వెనుక ప్రాంతంలో పారిశుధ్య పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో వారికి ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దానిని తెరిచి చూడగా, అందులో రూ. 15,000 నగదుతో పాటు కొన్ని ఆధార్ కార్డులు ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు.
డబ్బు చూస్తే ఎవరికైనా ఆశ కలగడం సహజం. కానీ, ఆ సిబ్బంది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఆ నగదును యజమానికి చేర్చాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆధార్ కార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలించి, వాటికి అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే అక్కడికి చేరుకోగా, శానిటేషన్ సిబ్బంది ఆ నగదును, కార్డులను అతనికి అప్పగించారు.
కష్టపడే చేతుల్లోనే నిజాయితీ.. పోగొట్టుకున్న నగదును బాధితుడికి చేరవేసిన శానిటేషన్ సిబ్బంది
Published on


