HomePoliticsవరంగల్ నగరానికి భూగర్భ డ్రెయినేజీ మంజూరు… సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ డా. కడియం కావ్య...

వరంగల్ నగరానికి భూగర్భ డ్రెయినేజీ మంజూరు… సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ డా. కడియం కావ్య కృతజ్ఞతలు

Published on

spot_img

హైదరాబాద్ | తేది: 08-03-2026

వరంగల్ మహానగరానికి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,257.20 కోట్లకు పాలనాపరమైన మంజూరు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ మహానగరానికి భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టు మంజూరు చేయడం ద్వారా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలను ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ప్రధాన నగరంగా వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని ఎంపీ తెలిపారు.

మౌలిక సదుపాయాలు, వైద్య, విద్య, రవాణా తదితర రంగాల్లో వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్టు అమలుతో నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు వరద ముంపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

ఈ ప్రాజెక్టు వరంగల్ మహానగర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

అదేవిధంగా వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నదని తెలిపారు.

త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, అలాగే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపనతో పాటు కాకతీయ టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే వరంగల్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త దశకు చేరుకుంటుందని ఎంపీ స్పష్టం చేశారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.