HomeWarangal Newsప్రజల ముంగిట ఎమ్మెల్యే: 62వ డివిజన్‌లో రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రజల ముంగిట ఎమ్మెల్యే: 62వ డివిజన్‌లో రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Published on

spot_img

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు పెరిగింది. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం 62వ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. మొత్తం రూ.1.64 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

​ రూ.50 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం. కాలనీలోని డ్రైనేజీ సమస్యలు, శ్మశాన వాటిక మౌలిక సదుపాయాల కల్పనపై హామీ మరియు రూ.1.14 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైనేజీ పనుల ప్రారంభించారు.

​ కాజీపేట ఎఫ్‌సీఐ గోదాం ప్రహరీ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు.

ప్రతి డివిజన్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో వారానికి రెండు, మూడు డివిజన్లలో పర్యటిస్తున్నాం. గత పాలకుల కాలానికి, ఇప్పటి అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి అన్నారు ​ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

​అభివృద్ధి పనులతో పాటు, ఎమ్మెల్యే ఆయా డివిజన్లలోని బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పార్టీ పునర్నిర్మాణం మరియు ప్రజా సేవలో కార్యకర్తల పాత్రపై దిశానిర్దేశం చేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకత్వానికి అండగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Latest articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.