HomeWarangal Newsకాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

spot_img

వర్ధన్నపేట, మే 09: వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై చెక్ డ్యాం శాశ్వత మరమ్మత్తు పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు తో కలిసి రూ.46.90 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులను ప్రారంభించారు.

అనంతరం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన రైతు వారము కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Dr Kadiyam Kavya

తాను ఏరియా ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసిన సమయంలో వర్షాలు పడితే రోడ్లపై భారీగా నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సమస్యను ఎన్నిసార్లు చూసినా గత పాలకులు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు చొరవతో శాశ్వత మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

Inauguration for Development Work

“కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం” అని స్పష్టం చేసిన ఎంపీ, ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తన ఎంపీ నిధుల నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు చేశానని, ప్రతి ఏడాది రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని వెల్లడించారు.

స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించిన ఎంపీ, “ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా నా వంతు సహకారం ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను” అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా 90 రోజుల వ్యవధిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేస్తూ, పెండింగ్ సమస్యలకు వేగంగా పరిష్కారం చూపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, వైస్ చైర్మన్ శోభారాణి, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.