HomeEntertainmentబిగ్‌బాస్ 10లోకి కుర్రాళ్ల ఫేవరేట్ బ్యూటీ..? ఇక TRPలు బద్ధలైపోవాల్సిందే..!

బిగ్‌బాస్ 10లోకి కుర్రాళ్ల ఫేవరేట్ బ్యూటీ..? ఇక TRPలు బద్ధలైపోవాల్సిందే..!

Published on

spot_img

బిగ్‌బాస్ 10లోకి కుర్రాళ్ల ఫేవరేట్ బ్యూటీ..? ఇక TRPలు బద్ధలైపోవాల్సిందే..:

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ సీజన్ 10 ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ప్రోమోతో షోపై ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండటం అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది.

షో ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉండగానే, ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. పలువురు యూట్యూబర్లు, టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, పండు మాస్టర్, జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, చంద్రహాస్ తదితరుల పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు టెలివిజన్ నటి పల్లవి గౌడది. పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె, తన నటనతో పాటు ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

దీంతో ఈసారి పల్లవి గౌడ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశాలపై వార్తలు ఊపందుకున్నాయి. ఆమె ఎంట్రీ ఇస్తే షోకు మరింత గ్లామర్‌తో పాటు ప్రేక్షకాదరణ కూడా పెరిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

View this post on Instagram

A post shared by Pulse20😉 (@pallavi_gowda_official)

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.