జయశంకర్ భూపాలపల్లి జిల్లా
తేది: 24-01-2026
భూపాలపల్లి నియోజకవర్గం, మొగుళ్లపల్లి మండలం పాత విస్సిపేట గ్రామంలో రూ.13 కోట్ల50 లక్షల వ్యయంతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదాం నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు శంకుస్థాపన చేసారు.
ఈసందర్భంగాఎంపీడాక్టర్కడియంకావ్యగారుమాట్లాడుతూ, రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాతే దేశానికి వెన్నెముక అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు.
అలాంటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు.
ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందన్నారు.
ఈ రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు.
పాత కాలంలో వడ్లు నిలువ చేసుకోవడానికి ఎవరికి వారు ఇంట్లొనే గుమ్మిలను ఏర్పాటు చూసుకునేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేదన్నారు.

భూపాలపల్లి ప్రాంతంలో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు అధికంగా సాగు అవుతున్నప్పటికీ, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ పేర్కొన్నారు.
రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్లను నిర్మిస్తుందని అందులో భాగంగనే నేడు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర వేర్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్ కుమార్, డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డిఎఓ బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్, ఎంఆర్ఓ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


