కరీంనగర్ జిల్లా కిసాన్‌నగర్ RBL బ్యాంకు కేంద్రంగా జరిగిన ఒక భారీ ఆర్థిక నేరాన్ని పోలీసులు ఛేదించారు. ఈ స్కామ్‌లో చైనా వ్యక్తులతో చేతులు కలిపి భారీగా నిధుల మళ్లింపు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
బండారి సాయిరామ్ అనే వ్యక్తి చైనా వ్యక్తులతో కలిసి 7 మూల్ (Mule) ఖాతాల ద్వారా రూ. 137 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపాడు. ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా 2% కమీషన్ తీసుకున్నట్లు కరీంనగర్ సీపీ (CP) గౌస్ ఆలం వెల్లడించారు.’ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’లో భాగంగా ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా ఈ కేసులో నిందితులంతా డిప్లొమా, డిగ్రీ, మరియు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం.


