HomeWarangal Newsనెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్.. 28 వాహనాలకు చలాన్లు

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్.. 28 వాహనాలకు చలాన్లు

Published on

spot_img

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్.. 28 వాహనాలకు చలాన్లు:

వరంగల్–కాజీపేట నగర పరిధిలో నెంబర్ ప్లేట్‌లు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

జూన్ 12, 13 తేదీలలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ ఎస్‌ఐలు సంపత్, మంగతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా నెంబర్ ప్లేట్‌లు లేకుండా లేదా సరిగా ప్రదర్శించకుండా నడుపుతున్న సుమారు 28 వాహనాలను గుర్తించారు. ఆయా వాహనదారులకు చలాన్లు విధించడంతో పాటు వెంటనే నెంబర్ ప్లేట్‌లు ఏర్పాటు చేయించి వాహనాలను విడుదల చేశారు.

అదేవిధంగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని డిటైన్ చేశారు. సంబంధిత పత్రాలు సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనానికి చట్టబద్ధమైన నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, రిజిస్ట్రేషన్ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో ఇకపై ఇలాంటి ఉల్లంఘనలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని పత్రాలతోనే వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేశారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...