HomeWarangal Newsహన్మకొండకు 4, వరంగల్‌కు 2: ఏర్పాటు కానున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు'

హన్మకొండకు 4, వరంగల్‌కు 2: ఏర్పాటు కానున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు’

Published on

spot_img

హన్మకొండ/వరంగల్: వచ్చే విద్యా సంవత్సరం (2026-2027) నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సరికొత్త విద్యా విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. హనుమకొండ జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో రెండు చొప్పున మొత్తం ఆరు ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట బోధన అందుతుంది. ఒక్కో స్కూల్ అభివృద్ధి కోసం దాదాపు రూ. 15 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం కేటాయించనుంది.

ఇవి సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో నడుస్తాయి. విద్యతో పాటు క్రీడలు, కళలు మరియు డిజిటల్ విద్యకు పెద్దపీట వేస్తారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, లైబ్రరీ మరియు మోడరన్ కిచెన్ వంటి సౌకర్యాలు ఉంటాయి.

స్కూళ్ల ఎంపిక జరిగిన ప్రాంతాలు:

హన్మకొండ జిల్లా:

• ​కాజీపేట ప్రభుత్వ హైస్కూల్ (బాయ్స్) – వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.

• ​ధర్మసాగర్ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్‌ఎస్ – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం.

• ​హసన్‌పర్తి ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ – వర్ధన్నపేట నియోజకవర్గం.

• ​నీరుకుళ్ల జెడ్పీహెచ్‌ఎస్ (ఆత్మకూరు మండలం) – పరకాల నియోజకవర్గం.

వరంగల్ జిల్లా:

• ​నర్సంపేట ప్రభుత్వ హైస్కూల్.

• ​శంభునిపేట జెడ్పీహెచ్‌ఎస్ – తూర్పు నియోజకవర్గం.

ఈ పాఠశాలల నిర్మాణ బాధ్యతలను పేరెంట్స్ కమిటీలకు అప్పగించనున్నారు. హెడ్ మాస్టర్ కన్వీనర్‌గా, ఒక ఇంజనీర్ మరియు 24 మంది తల్లిదండ్రులు సభ్యులుగా ఈ కమిటీ ఉంటుంది.

 రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మోడల్‌గా తీసుకుని వీటిని తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 15 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.