హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23వ తేదీన (గురువారం) అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 03:00 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న క్యాబినెట్ మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరగనుంది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం అధికారిక ఉత్తర్వులను (U.O. Note No. 33) జారీ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గంలోని సభ్యులందరూ ఈ భేటీకి హాజరుకావాలని సీఎస్ తన నోటీసులో కోరారు.
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు లేదా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


