HomeLatest Newsసాయిల్ హెల్త్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

సాయిల్ హెల్త్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

Published on

spot_img

హన్మకొండ: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరిరక్షణ లక్ష్యంగా గ్రామ స్థాయిలో ‘సాయిల్ హెల్త్ వాలంటీర్ల’ నియామకానికి ప్రక్రియ ప్రారంభమైంది. వ్యవసాయంపై అవగాహన పెంచడం మరియు రైతులకు సాంకేతిక సహకారం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

గ్రామానికి ముగ్గురు చొప్పున వాలంటీర్లను వ్యవసాయ శాఖ ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్ – ICRISAT) నుండి ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది.

శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు పొలాల్లో మట్టి నమూనాల సేకరణ మరియు పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించడం, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం మరియు పంట కోత తర్వాత మిగిలే వ్యర్థాలను కాల్చకుండా, వాటిని ఎరువులుగా ఎలా మార్చుకోవాలో రైతులకు వివరించడం, వ్యవసాయ శాఖ పథకాలు మరియు నూతన సాగు పద్ధతులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం వంటి భాద్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

​ఈ వాలంటీర్ పోస్టులపై ఆసక్తి గల అభ్యర్థులు తమ సమీపంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో (MPDO Office) దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.