HomeWarangal Newsక్రమశిక్షణ తప్పిన ముగ్గురు పోలీసులపై వేటు: సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ ఉత్తర్వులు

క్రమశిక్షణ తప్పిన ముగ్గురు పోలీసులపై వేటు: సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ ఉత్తర్వులు

Published on

spot_img

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, శాఖా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిపై కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం. తిరుపతి పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేవలం వ్యాపారమే కాకుండా, సకాలంలో డబ్బు చెల్లించని వారి ఇళ్లపై దాడులకు కూడా పాల్పడినట్లు అభియోగాలు రావడంతో సీపీ ఆయనను సస్పెండ్ చేశారు.

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి. రాములు మద్యం నైట్ ఇంచార్జిగా విధుల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.

చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ. రమేష్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ అతిక్రమించినందుకు గాను ఆయనను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

శాఖలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడే వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles