HomeLatest Newsఅన్నదాత గుండెకోత.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

అన్నదాత గుండెకోత.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Published on

spot_img

​నిర్మల్: నిర్మల్ జిల్లాలో రైతన్నలకు తీరని అన్యాయం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట, చేతికొచ్చే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదవ్వడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.

నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న, వరి, జొన్న పంటలు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ లైన్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే షార్ట్ సర్క్యూట్ సంభవించిందని సమాచారం. అప్పులు చేసి, కష్టపడి పండించిన పంట కళ్లముందే కాలిపోతుంటే రైతులు గుండెవిసిలా విలపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. “ప్రజల ఆకలి తీర్చడమే తప్ప మరో కల్మషం తెలియని అన్నదాతకు పంట అంటే సొంత బిడ్డతో సమానం” అంటూ ఈ ఘటనపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణ స్పందన :-

ఈ హృదయవిదారక ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరగా సేకరించి, వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులకు భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టరును ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్ల నిర్వహణపై దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచించారు.

​రైతులను ఆదుకోవడం అధికారుల కనీస బాధ్యత అని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.