తెలంగాణ విద్యశాఖ విద్యార్థులకు ఒక ముఖ్యమైన శుభవార్త అందించింది. రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ డిజిటల్ పద్ధతిని ప్రవేశపెట్టింది.
ఇకపై రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారి ఆన్సర్ షీట్లను పోస్టల్ ద్వారా పంపే పాత పద్ధతికి స్వస్తి పలికారు. నేరుగా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపనున్నారు.
గతంలో సప్లిమెంటరీ ఫలితాలు వచ్చినా కూడా చాలా మందికి ఈ పేపర్లు అందేవి కావు. ఈ ఆలస్యాన్ని నివారించడానికి ‘డిజిటల్ వాల్యుయేషన్’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 14 వరకు అవకాశం ఉంది.
విద్యార్థులకు సమయం ఆదా అవ్వడంతో పాటు పారదర్శకత పెరగడానికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది.


