ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తన మానవత్వాన్ని చాటుకున్నారు.
హన్మకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంపీ, బాలుడి చికిత్స కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ మంజూరు చేయించిన రూ. 4,00,000 చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎంపీ స్వయంగా అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ బిడ్డకూ వైద్యం ఆగకూడదనే ఉద్దేశంతో తక్షణమే స్పందించి ఈ నిధులను మంజూరు చేయించాం అని డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.
తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఎల్.ఓ.సి మంజూరు చేయించి, కొండంత అండగా నిలిచిన ఎంపీ కడియం కావ్య గారికి ఆదిల్ అహ్మద్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.


