HomeLatest Newsబీఆర్‌ఎస్ సభను అడ్డుకునేందుకే కాంగ్రెస్ కుట్రలు: దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం

బీఆర్‌ఎస్ సభను అడ్డుకునేందుకే కాంగ్రెస్ కుట్రలు: దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం

Published on

spot_img

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. ఈ నెల 6వ తేదీన హన్మకొండలో బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన ‘రైతు సంగ్రామ సభ’ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బీఆర్‌ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కావాలనే ‘రైతు మేళా’లను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. నగరం అంతటా బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ జండాలను కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పక్షాన నిలబడేందుకే రైతు సంగ్రామ సభ నిర్వహిస్తున్నామని, దీనికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఎద్దేవా చేశారు.

​”కాంగ్రెస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలి. ఎన్ని కుట్రలు చేసినా రైతు సంగ్రామ సభ విజయవంతం కావడం ఖాయం. “— దాస్యం వినయ్ భాస్కర్, మాజీ చీఫ్ విప్

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.