HomeLatest Newsపేదల ప్లేట్లోకి 'జొన్న' అన్నం.. రేషన్ షాపుల ద్వారా పంపిణీకి సర్కార్ కసరత్తు

పేదల ప్లేట్లోకి ‘జొన్న’ అన్నం.. రేషన్ షాపుల ద్వారా పంపిణీకి సర్కార్ కసరత్తు

Published on

spot_img

తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే అందుతుండగా, త్వరలో ఆ జాబితాలోకి జొన్నలు, మొక్కజొన్నలు కూడా చేరనున్నాయి. మార్క్ ఫెడ్ సేకరించిన పంటను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

​ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంపిణీ ప్రక్రియపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ హాస్టళ్లు మరియు గురుకుల పాఠశాలల్లో జొన్నలను ఆహారంగా అందించాలని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, సామాన్యులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందుతుందని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.