HomeWarangal Newsఐదేళ్ల సేవ గర్వంగా ఉంది: మేయర్ గుండు సుధారాణి

ఐదేళ్ల సేవ గర్వంగా ఉంది: మేయర్ గుండు సుధారాణి

Published on

spot_img

​వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పాలకవర్గం తన ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన ఆఖరి కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నగరంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 76.56 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో రూ. 3331 కోట్ల భారీ నిధులతో మొత్తం 6676 అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ వివరించారు. ఇందులో ఇప్పటికే 60% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

​ రాజకీయ పార్టీలకు అతీతంగా పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి నగరాభివృద్ధి కోసం కృషి చేయడం వల్లే ఈ స్థాయిలో ప్రగతి సాధ్యమైందని ఆమె అన్నారు.

​”వరంగల్ మహానగరానికి ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం రావడం నా జీవితంలో ఎంతో గర్వంగా ఉంది. అభివృద్ధి విషయంలో మా పాలకవర్గం అద్భుతమైన ఫలితాలను సాధించింది.”— గుండు సుధారాణి, వరంగల్ మేయర్

పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, కౌన్సిల్ సభ్యులు మరియు అధికారులు కలిసి ఐదేళ్ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్ నగర రూపురేఖలను మార్చడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉందని మేయర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles