వరంగల్‌లో నిర్వహించిన ఒక సభలో రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మరియు వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్. హంటర్ రోడ్డులో జరిగిన సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అసభ్యకరంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, పరువు నష్టం కలిగించేలా మాట్లాడిన కేటీఆర్‌పై సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే కేసు నమోదు చేయాలని వారు సీపీని కోరారు.
”ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి విద్వేషం రేకెత్తించేలా మాట్లాడటం సరికాదు. చట్టపరమైన చర్యల ద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.” అని నాయకులు స్పష్టం చేశారు.


