HomeWarangal Newsహన్మకొండలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 15 కోట్లతో మల్టీ లెవల్ పార్కింగ్‌కు శంకుస్థాపన

హన్మకొండలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 15 కోట్లతో మల్టీ లెవల్ పార్కింగ్‌కు శంకుస్థాపన

Published on

spot_img

హన్మకొండ: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరియు పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హన్మకొండలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అశోక థియేటర్ వద్ద సుమారు రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘మల్టీ పర్పస్ కార్ పార్కింగ్’ కేంద్రానికి రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు.

​శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ, హనుమకొండను ఒక స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మల్టీ లెవల్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, వ్యాపార ప్రాంతాల్లో రద్దీ తగ్గుతుందని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles