HomeWarangal Newsడిప్యూటీ మేయర్ పదవీ కాలం ముగింపు: వరంగల్ 36వ డివిజన్‌లో టపాకాయలు, స్వీట్లతో సంబరాలు

డిప్యూటీ మేయర్ పదవీ కాలం ముగింపు: వరంగల్ 36వ డివిజన్‌లో టపాకాయలు, స్వీట్లతో సంబరాలు

Published on

spot_img

వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నగర డిప్యూటీ మేయర్ పాలన ముగిసిన సందర్భంగా 36వ డివిజన్ పరిధిలోని చింతల్ బ్రిడ్జి వద్ద ఉన్న వార్డ్ ఆఫీస్ దగ్గర స్థానిక ప్రజలు, నాయకులు వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు.

​డిప్యూటీ మేయర్ పదవీ కాలం ముగియడాన్ని పురస్కరించుకుని, డివిజన్ వార్డ్ ఆఫీస్‌ను పాల‌తో శుద్ధి చేసిన స్థానికులు, అనంతరం గుమ్మడికాయతో దిష్టి తీసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యాలయం ముందు భారీగా టపాకాయలు పేల్చి సందడి చేశారు.

​ఈ కార్యక్రమంలో సామాజికవేత్త, సుశ్మిత గార్డెన్ యజమాని మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పాల్గొని ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ ప్రజలు ఈ మార్పు పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles