HomeWarangal Newsవరంగల్‌లో విషాదం: కోతుల దాడిలో భవనంపై నుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

వరంగల్‌లో విషాదం: కోతుల దాడిలో భవనంపై నుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

Published on

spot_img

వరంగల్ నగరంలోని ఎల్లంబజార్ ప్రాంతంలో కోతుల బెడద ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. కోతులు ఒక్కసారిగా వెంటాడటంతో తప్పించుకోబోయి ప్రమాదవశాత్తూ భవనం పైనుండి కింద పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంబజార్‌కు చెందిన సదరు వ్యక్తి తన భవనంపై ఉన్న సమయంలో కోతుల మంద ఆయనపై దాడికి ప్రయత్నించాయి. వాటి నుండి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పైనుండి ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయారు.

ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావమై అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

​నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడదపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles