వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలందించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
శుక్రవారం శాయంపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీపీకి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన కొత్త సీఐకి సీపీ పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దిగువ స్థాయి అధికారులు మరియు సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, అందరూ సమన్వయంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా సీపీ స్పష్టం చేశారు.


