HomePoliticsబండి సంజయ్ కుమారుడి పై ఆరోపణలు.. ఇరు వర్గాల పై రెండు కేసులు నమోదు..??

బండి సంజయ్ కుమారుడి పై ఆరోపణలు.. ఇరు వర్గాల పై రెండు కేసులు నమోదు..??

spot_img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, Bandi Sanjay Kumar కుమారుడు బండి సాయి భగీరథ్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బండి సాయి భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా.. మరోవైపు మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదవడం సంచలనం రేపుతోంది.

భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..

హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, తర్వాత తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. తాను నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని, వ్యక్తిగత ఆరోపణలు చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని, ఇప్పటికే ఖర్చుల పేరుతో రూ.50 వేల రూపాయలు చెల్లించినప్పటికీ వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Complaint Copy 1

ఈ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ టూ టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 253/2026గా కేసు నమోదు చేసి, BNS సెక్షన్లు 308(5), 351(2), 61(2), 3(5) కింద దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Complaint Copy 2

మైనర్ బాలిక తల్లిదండ్రులు బండి సాయి భగీరథ్‌పై తీవ్ర ఆరోపణలు

ఇదిలా ఉండగా, మరోవైపు మైనర్ బాలిక తల్లిదండ్రులు బండి సాయి భగీరథ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 17 ఏళ్ల కుమార్తెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఘటనలు జరిగాయని వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు BNS 74, 75 సెక్షన్లతో పాటు POCSO చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, కేసు నుంచి తప్పించుకునేందుకే తమ కూతురిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బండి సంజయ్ వర్గం…

అయితే బండి సంజయ్ వర్గం మాత్రం ఇది ప్రణాళికాబద్ధమైన “హనీ ట్రాప్” వ్యవహారమని, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని వాదిస్తోంది. ప్రస్తుతం రెండు వర్గాల ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అసలు నిజానిజాలు ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు బండి సాయి భగీరథ్ ఫిర్యాదుకు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ, మరోవైపు నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలు ఇంకా బయటకు రాలేదు. దీంతో పోలీసుల దర్యాప్తు అనంతరం మాత్రమే వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.