హనుమకొండ: హసన్పర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ బైకును లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన చల్ల బతుకయ్య, లక్ష్మీగా గుర్తించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


