గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం ‘గ్రీవెన్స్’ (ప్రజావాణి) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అదనపు కమిషనర్ చంద్రశేఖర్ స్వయంగా విజ్ఞప్తులను స్వీకరించారు.
ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, ఆస్తి పన్ను సవరణలు, మంచినీటి సరఫరా మరియు రోడ్ల మరమ్మతులపై ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని అదనపు కమిషనర్ అధికారులను ఆదేశించారు.


