నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
విధుల్లో ఉండగానే ఆయన ఆఫీసులో కుప్పకూలి పడిపోయారు. సహచర సిబ్బంది వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే శ్రీనివాస్ మృతి చెందినట్లు సమాచారం.
విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు కోల్పోవడంతో రెవెన్యూ శాఖ సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సహోద్యోగులు, స్థానిక అధికారులు శ్రీనివాస్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీనివాస్ కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భారత్‌కు చేరుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.


