HomeWarangal Newsవరంగల్ నగరాన్ని వణికిస్తున్న చైన్ స్నాచర్లు.. ఒకే రాత్రి రెండు చోట్ల దాడులు

వరంగల్ నగరాన్ని వణికిస్తున్న చైన్ స్నాచర్లు.. ఒకే రాత్రి రెండు చోట్ల దాడులు

Published on

spot_img

వరంగల్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజా ఘటనలతో వరంగల్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే రాత్రి, ఒకే తరహాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటం గమనార్హం.

కాశీబుగ్గలో దారుణం: 

సొసైటీ కాలనీ రోడ్ నెంబర్ 3లో నివాసం ఉండే దీప శ్రీ అనే మహిళ, రాత్రి సమయంలో ఇంటి బయట తన పిల్లలకు అన్నం తినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని వేగంగా పారిపోయారు.

క్రిస్టియన్ కాలనీలో మరో దాడి: 

ఇదే తరహాలో క్రిస్టియన్ కాలనీలో కూడా దుండగులు పంజా విసిరారు. అడ్వకేట్ మైదం వివేక్ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా, అదే పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు మెడలోని చైన్ లాక్కెళ్లారు.

పోలీసుల అలర్ట్:

వరుసగా జరుగుతున్న ఈ చైన్ స్నాచింగ్‌లు ఒకే గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పల్సర్ బైక్ పై వస్తున్న ఈ ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగర ప్రజలు, ముఖ్యంగా మహిళలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles