న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ మరియు ఇంధన పొదుపు లక్ష్యంగా ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయనున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. మే 14 నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలులోకి రానుందని, ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంక్ యాజమాన్యాల సంఘం ఈ ప్రకటన చేసినట్లు సారాంశం.
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఇంధన వనరులను కాపాడుకోవడానికి ఆదివారం బంద్ పాటించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంపిక చేసిన ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం నాడు బంకులు పనిచేయవని తెలుస్తోంది.


