హైదరాబాద్: బండి భగీరథ్ తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పిటిషన్ను వెకేషన్ బెంచ్ ముందుకు తీసుకొచ్చారు. ఈ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 14న (మే 14) విచారణ చేపట్టనుంది.
ఆ రోజున వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


