వరంగల్: ప్రజల ఇళ్లలో వెలుగులు నింపడమే కాకుండా, సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం సంతోషకరమని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నూతన ఆరో (RO) వాటర్ ప్లాంట్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు.
’హోప్‌ఫుల్ హార్ట్స్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు జరిగాయి.
ఈ కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపర్ ఇంటెండెంట్ హరిశ్చంద్ర రెడ్డి తదితరులు పాల్గొని, సామాజిక సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.
రోగుల సౌకర్యార్థం ఇలాంటి అత్యాధునిక వసతులు కల్పించడం అభినందనీయమని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు.


