హన్మకొండ: జన గణనలో భాగంగా చేపడుతున్న ఇళ్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇళ్ల గణన కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు.
హన్మకొండలోని పలు కాలనీల్లో ఎన్యూమరేటర్లు వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ నిశితంగా గమనించారు. గృహాల సంఖ్య, నివాసితుల పూర్తి వివరాలను ఎక్కడా పొరపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
డేటా సేకరణలో ఎదురయ్యే సవాళ్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సంబంధిత రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


