హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ అందింది. ఒక POCSO (పోక్సో) కేసు బాధితురాలి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ న్యాయవాది పప్పు నాగేశ్వర రావు ఈ లేఖను రాశారు.
బండి సంజయ్ కేంద్ర మంత్రి వంటి అత్యున్నత పదవిలో కొనసాగితే, బాధితురాలికి న్యాయం జరగకుండా కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని న్యాయవాది ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇటీవల ఆయన బహిరంగంగానే బెదిరింపులకు కూడా దిగారని న్యాయవాది నాగేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నిష్పక్షపాతంగా సాగాలంటే ఆయనను మంత్రివర్గం నుండి తొలగించడమే సరైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.


