సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అట్లీ గురించి అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సెన్సేషనల్ కాన్సెప్ట్ తో “రాకా” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా అల్లు అర్జున్ కి గ్లోబల్ లెవెల్ ఇమేజ్ తీసుకొస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికోసం అటు అట్లీ ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా సమాంతరంగానే కష్టపడుతున్నారు . అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సినిమాల గురించి బాగా ట్రెండ్ అయిన అట్లీ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ పరంగా సోషల్ మీడియాలో బాగా హైలెట్ గా మారారు .
రీసెంట్ గానే అట్లీ భార్య ప్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు . గత ఏప్రిల్లో జన్మనిచ్చిన తన కుమార్తెకు అట్లీ దంపతులు రీసెంట్ గానే పేరు పెట్టారు “మియూ” (MiYou) అనే ప్రత్యేకమైన పేరుని తమ బిడ్డకు పెట్టినట్లు అట్లీ దంపతులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు . పాప పుట్టిన దాదాపు నెల రోజుల తర్వాత ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ పేరుని అధికారికంగా ప్రకటించారు . ఎప్పుడైతే అట్లీ దంపతులు కుమార్తెకు “మియూ” అనే పేరు పెట్టారు అన్న పోస్ట్ బయటపడిందో అప్పటినుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ “మియూ” పేరు బాగా వైరల్ గా మారింది .
ఎన్నో పేర్లు ఉండగా ఎందుకు అట్లీ “మియూ” అనే పేరు పెట్టారు అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు . ఇది ఒక జపనీస్ పేరు కావడంతో సోషల్ మీడియాలో ఇంకా హైలైట్ గా మారింది . అయితే దీనికి వివరణ ఇస్తూ అట్లీ క్లారిటీ ఇచ్చారు . సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు . “మా హృదయాలకు ఒక కొత్త ఇల్లు దొరికింది . ఆమె పేరునే ‘ మియూ ‘ మా గుండెల్లో అత్యంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్న చిన్నారి దేవత ” అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకోచ్చారు.
అంతేకాదు మియూ అన్న పేరుకు అర్థం కూడా చెప్పుకొచ్చారు. వాళ్లు ఈ పేరుని జపనీస్ సంస్కృతి నుంచి తీసుకున్నట్లు తెలిపారు. జపనీస్ భాషలో “మి”(Mi) అంటే “అందం”.. “యూ”(You) అంటే మృదుత్వం, శ్రేష్టత అని అర్థం మొత్తం కలిపి చూస్తే “మియూ” అంటే అందం , ప్రేమ , పవిత్రమైన సౌమ్యత కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుంది. కూతురికి ఇంత చక్కనైన పేరు పెట్టినందుకు అట్లీ దంపతులను ప్రశంసించేస్తున్నారు జనాలు. అట్లీ ఏది చేసిన చాలా డిఫరెంట్ గా.. వేరే లేవ్ల్ లో చేస్తారు. రాకా సినిమా టైటిల్ విషయంలోనూ అలానే చేశారు . ఇప్పుడు తన బిడ్డకు పేరుని కూడా అలాగే వెరైటీగా పెట్టాడు. అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా అట్లీ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.


